
ABDRUSHIN
సత్యము యొక్క వెలుగులో
గ్రాలు సందేశము
సంపుటము I
సమస్త చీకటి నుండి నిన్ను విమోచించుకో!
ప్రభువు వాక్యమును సరిగా గ్రహించుటకు
శ్రమించని వాడు తనను అపరాధిగా చేసుకొనును!
సంపుటము II
ఇప్పుడు బలంగా ఆరోహించు!
మెర్సీ పోల్దాస్ ద్వారా ఈ వాక్యాలు చదవబడినవి.
అనువాదం యొక్క కాపీరైటును గ్రెయిల్ మెసేజ్ ఫౌండేషన్ కలిగియున్నది.
గ్రాలు సందేశము కొత్త మానవాళి యొక్క నిర్మాణాన్ని చేపడుతుంది. ఈ నిర్మాణానికి మీరు సహకరించాలనుకుంటే మాకు చేయూతనివ్వండి.
గ్రాలు సందేశము జ్ఞానం యొక్క ఆధారమైయున్నది. అది కఠినమైన పరీక్ష ద్వారా, మానవత్వం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ప్రశ్నలపై కొత్త వెలుగులు ప్రసరించుటకు మరియు స్పష్టం చేయుటకు అనుమతిస్తుంది.
అది ఒక క్రొత్త మతాన్ని తేదు మరియు అది ప్రతి యొక్క మతోద్దేశమునుండి స్వతంత్రమైయున్నది. కాగా సమస్త జీవన వాస్తవికతను గురించిన లోతైనచర్చ, కేవలం మతాలలోనే కాక జీవితం యొక్క అన్ని రంగాలలలో స్థాపించబడిన మరియు కార్యాచరణ స్వేచ్చను పరిమితం చేసే సమస్త మూఢ సిద్ధాంతాలు మరియు బలవంతాలనుండి విడిపిస్తుంది.
అద్వితీయమైనశక్తితో మరియు స్పష్టతతో అది మనిషికి, అతడు తన ఆధ్యాత్మిక స్వస్థాలానికి స్పృహతో తిరిగిపోగోరినట్లయితే, అతడు తప్పక అనుసరించవలసిన మార్గాన్ని చూపిస్తుంది.
గ్రాలు సందేశము ఒక క్రమంలో ఉంచబడిన 169 ఉపన్యాసాలను కలిగియున్నది; రచయిత నిర్ణయించిన ఈ క్రమము, ఆ మార్గాన్ని సుగమం చేస్తుంది.
సమీప భవిష్యత్తులో మేము ఈ ఉపన్యాసాలను ఆడియో ఫైల్స్ రూపంలో ఈ పేజీలో వరుసగా ప్రచురిస్తాము, ఎందుకంటే మాట్లాడే పదం ఆత్మకు, వ్రాయబడిన పదం కంటే భిన్నమైన ప్రవేశాన్ని కలిగి యుంటుంది. తద్వారా, నేటి అత్యవసర పరిస్థితిలో, అన్వేషించే ప్రతి ఒక్కడూ స్వతంత్రంగా మరియు వ్యక్తిగతంగా తన సృష్టికర్తను ఆశ్రయించవచ్చు, కాగా కేవలం ఆయన వద్దనుండి మాత్రమే నిజమైన సహాయము మరియు దృఢమైన మద్దతు వస్తాయి.
నేటి పరిస్థితికి వాటి ప్రాముఖ్యత దృష్ట్యా మేము ఈ మూడు ఉపన్యాసాలను మొదటగా అందిస్తున్నాము